Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గబ్బిలాలపేటలో సీసీ రోడ్డు నిర్మించాలని కాలనీవాసుల వినతి

Author
Posted By Marelli kiran
| 15 Nov 2026, 10:41 PM |
గబ్బిలాలపేటలో సీసీ రోడ్డు నిర్మించాలని కాలనీవాసుల వినతి

జవహర్ నగర్, కీసర సర్కిల్, నవంబర్ 15 (ప్రజా నేస్తం జ్వాల): జవహర్ నగర్ పరిధిలోని గబ్బిలాలపేట కాలనీలో రహదారి సౌకర్యం లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 25 ఏళ్లుగా కాలనీలో నివాసం ఉంటున్నప్పటికీ ఇప్పటివరకు సరైన రహదారి నిర్మించలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మట్టి రోడ్డుపై రాకపోకలు సాగించాల్సి వస్తోందని, వర్షాకాలంలో రహదారి బురదమయంగా మారి నడిచేందుకు కూడా ఇబ్బందిగా ఉంటోందని తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు, వాహనదారులు జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు.

సమస్యను పరిష్కరించాలని కోరుతూ జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు దొంతగాని శాంతి కోటేష్ గౌడ్‌కు కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. 30 అడుగుల ప్రధాన రహదారి నుంచి తమ గల్లీ చివరి వరకు సీసీ రోడ్డు నిర్మించి, దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. 25 ఏళ్లుగా నివాసం ఉంటున్నా కనీస రహదారి సౌకర్యం లేకపోవడం ఇబ్బందికరంగా ఉందని, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సీసీ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరారు.

ఈ కార్యక్రమంలో ఎం.డి. సలీం, కనకయ్య, జగన్, బాదావత్, సుజిత్, ఎస్. రంగయ్య, ఎస్. సరిత, ఎల్. కనకయ్య, ఎల్. పుష్ప, పురుషోత్తం, యాకయ్య, అంజమ్మ, పద్మ, సుధీన్ కుమార్, మాధవి, భాగ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి