గబ్బిలాలపేటలో సీసీ రోడ్డు నిర్మించాలని కాలనీవాసుల వినతి

జవహర్ నగర్, కీసర సర్కిల్, నవంబర్ 15 (ప్రజా నేస్తం జ్వాల): జవహర్ నగర్ పరిధిలోని గబ్బిలాలపేట కాలనీలో రహదారి సౌకర్యం లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 25 ఏళ్లుగా కాలనీలో నివాసం ఉంటున్నప్పటికీ ఇప్పటివరకు సరైన రహదారి నిర్మించలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మట్టి రోడ్డుపై రాకపోకలు సాగించాల్సి వస్తోందని, వర్షాకాలంలో రహదారి బురదమయంగా మారి నడిచేందుకు కూడా ఇబ్బందిగా ఉంటోందని తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు, వాహనదారులు జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు దొంతగాని శాంతి కోటేష్ గౌడ్‌కు కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. 30 అడుగుల...