Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రైవేట్ కాలేజీలకు 1 నుంచి 12వ తరగతి వరకు నిర్వహణకు అవకాశం

Author
Posted By Marelli kiran
| 15 Nov 2026, 10:32 PM |
ప్రైవేట్ కాలేజీలకు 1 నుంచి 12వ తరగతి వరకు నిర్వహణకు అవకాశం

హనుమకొండ, 15 నవంబర్ 2026 (ప్రజానేస్తం జ్వాల): రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్న నూతన 10+2 విద్యా విధానంపై ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యదర్శి అభిలాష స్పష్టత ఇచ్చారు. ఆసక్తి ఉన్న ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యాసంస్థలను నిర్వహించుకోవచ్చని వెల్లడించారు. ఇందుకు అవసరమైన అనుమతులను నిబంధనల ప్రకారం మంజూరు చేస్తామని తెలిపారు.

ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో ఆమె ఈ విషయాలను వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే అన్ని తరగతులను తప్పనిసరిగా ప్రారంభించాలనే నిబంధన ఏమీ లేదని స్పష్టం చేశారు. ఆయా విద్యాసంస్థల ఆసక్తి, సన్నద్ధత ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థుల విద్యా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యా వ్యవస్థలో ఇంటర్మీడియట్ విద్యను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కార్యదర్శి వివరించారు. నూతన విద్యా విధానం అమలులో భాగంగా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ విద్యాసంస్థలు ముందుకు వెళ్లవచ్చని సూచించారు.