ప్రైవేట్ కాలేజీలకు 1 నుంచి 12వ తరగతి వరకు నిర్వహణకు అవకాశం
హనుమకొండ, 15 నవంబర్ 2026 (ప్రజానేస్తం జ్వాల): రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్న నూతన 10+2 విద్యా విధానంపై ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యదర్శి అభిలాష స్పష్టత ఇచ్చారు. ఆసక్తి ఉన్న ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యాసంస్థలను నిర్వహించుకోవచ్చని వెల్లడించారు. ఇందుకు అవసరమైన అనుమతులను నిబంధనల ప్రకారం మంజూరు చేస్తామని తెలిపారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో ఆమె ఈ విషయాలను వివరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే అన్ని తరగతులను తప్పనిసరిగా ప్రారంభించాలనే నిబంధన ఏమీ లేదని స్పష్టం చేశారు. ఆయా విద్యాసంస్థల...