Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఘనంగా 73వ సహకార వారోత్సవాలు

Author
Posted By Praja Nestham Jwala News
| 14 Nov 2026, 08:09 PM |
ఘనంగా 73వ సహకార వారోత్సవాలు

ఆసిఫాబాద్, నవంబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): ఆసిఫాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో 73వ సహకార వారోత్సవాలను పురస్కరించుకుని శనివారం పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు అలీ బిన్ అహ్మద్ సహకార పతాకాన్ని ఆవిష్కరించి వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సహకార రంగం అభివృద్ధిలో రైతులు, సహకార సంఘాలు పోషిస్తున్న కీలక పాత్రను నాయకులు గుర్తుచేసుకున్నారు. రైతుల ఆర్థిక అభ్యున్నతికి సహకార సంఘాలు అందిస్తున్న సేవలను వివరించారు. వ్యవసాయ రంగానికి అవసరమైన సహకారం అందించడంతో పాటు రైతుల ప్రయోజనాలను కాపాడటంలో సహకార వ్యవస్థ ప్రాధాన్యతను వివరించారు.

సహకార ఉద్యమం మరింత బలోపేతం కావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. రైతులు, సహకార సంఘాల సభ్యులు పరస్పర సహకారంతో ముందుకు సాగుతూ సంఘాల అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎం.డి. అహ్మద్, అడ్వకేట్స్ అధ్యక్షుడు రాపర్తి రవి, సహకార సంఘం వైస్ చైర్మన్ రూకం ప్రహ్లాద్, సంఘం డైరెక్టర్లు విజయలక్ష్మి, దుర్గం దావు, జావిద్, బ్యాంకు మేనేజర్ వెంకట రవీందర్, కోట తిరుపతి, సంఘం కార్యదర్శి వెంకటరమణ, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.