ఘనంగా 73వ సహకార వారోత్సవాలు

ఆసిఫాబాద్, నవంబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): ఆసిఫాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో 73వ సహకార వారోత్సవాలను పురస్కరించుకుని శనివారం పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు అలీ బిన్ అహ్మద్ సహకార పతాకాన్ని ఆవిష్కరించి వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సహకార రంగం అభివృద్ధిలో రైతులు, సహకార సంఘాలు పోషిస్తున్న కీలక పాత్రను నాయకులు గుర్తుచేసుకున్నారు. రైతుల ఆర్థిక అభ్యున్నతికి సహకార సంఘాలు అందిస్తున్న సేవలను వివరించారు. వ్యవసాయ రంగానికి అవసరమైన సహకారం అందించడంతో పాటు రైతుల ప్రయోజనాలను కాపాడటంలో సహకార వ్యవస్థ ప్రాధాన్యతను వివరించారు. సహకార ఉద్యమం మరింత బలోపేతం కావడానికి ప్రతి ఒక్కరూ కృషి...