Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలి: హనుమకొండ డీఎంహెచ్‌వో డాక్టర్ అప్పయ్య ఆదేశం

Author
Posted By Marelli kiran
| 14 Nov 2026, 07:48 PM |
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలి: హనుమకొండ డీఎంహెచ్‌వో డాక్టర్ అప్పయ్య ఆదేశం

హనుమకొండ, నవంబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డాక్టర్ అప్పయ్య వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు శనివారం న్యూశాయంపేట, కరుణాపురం, మడికొండ, హసన్‌పర్తి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, వైద్య సిబ్బంది విధుల నిర్వహణ, ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును అధికారులు సమీక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యం కోసం వచ్చే సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ అప్పయ్య సూచించారు.

ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. గర్భిణులకు అవసరమైన వైద్య పరీక్షలు సకాలంలో నిర్వహించాలని, బాలింతలకు తగిన వైద్య సలహాలు, సేవలు అందించాలని తెలిపారు. చిన్నారులకు నిర్ణీత టీకాల షెడ్యూల్ ప్రకారం అన్ని టీకాలు తప్పనిసరిగా వేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజారోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ఆసుపత్రులకు వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ అప్పయ్య సూచించారు.