ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలి: హనుమకొండ డీఎంహెచ్‌వో డాక్టర్ అప్పయ్య ఆదేశం

హనుమకొండ, నవంబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డాక్టర్ అప్పయ్య వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు శనివారం న్యూశాయంపేట, కరుణాపురం, మడికొండ, హసన్‌పర్తి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, వైద్య సిబ్బంది విధుల నిర్వహణ, ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును అధికారులు సమీక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యం కోసం వచ్చే సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా...