Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రాపాకపల్లిలో ఘనంగా బాలల ప్రత్యేక గ్రామసభ

Author
Posted By Praja Nestham Jwala News
| 14 Nov 2026, 07:25 PM |
రాపాకపల్లిలో ఘనంగా బాలల ప్రత్యేక గ్రామసభ

రాపాకపల్లి, నవంబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బాలల ప్రత్యేక గ్రామసభను రాపాకపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ మండల ప్రాదేశిక ప్రాథమిక పాఠశాలలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కందుకూరు జయేందర్ పాఠశాల విద్యార్థులకు భారత తొలి ప్రధానమంత్రి స్వర్గీయ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాలల ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో తల్లిదండ్రులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం నాణ్యంగా ఉండటంతో పాటు పిల్లలకు నిర్ణీత సమయంలో అందేలా చూడాలని తెలిపారు. పిల్లలకు నాణ్యమైన ఆహారం, మెరుగైన విద్యా వాతావరణం కల్పించినప్పుడే ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుందని పేర్కొన్నారు.

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ సర్పంచ్‌గా తన బాధ్యతను గుర్తించి, గ్రామంలోని ప్రతి బాలుడు పాఠశాలకు వెళ్లి విద్యను అభ్యసించేలా అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే పాఠశాలలో మౌలిక వసతులకు సంబంధించి ఏవైనా సమస్యలు, అవసరాలు ఉంటే వాటిని గౌరవ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సంబంధిత అధికారులతో మాట్లాడి పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. బాలల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులందరికీ మరోసారి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.