రాపాకపల్లిలో ఘనంగా బాలల ప్రత్యేక గ్రామసభ

రాపాకపల్లి, నవంబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బాలల ప్రత్యేక గ్రామసభను రాపాకపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ మండల ప్రాదేశిక ప్రాథమిక పాఠశాలలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కందుకూరు జయేందర్ పాఠశాల విద్యార్థులకు భారత తొలి ప్రధానమంత్రి స్వర్గీయ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాలల ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో తల్లిదండ్రులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం నాణ్యంగా ఉండటంతో పాటు పిల్లలకు నిర్ణీత సమయంలో అందేలా చూడాలని తెలిపారు. పిల్లలకు...