Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వేలేరు గ్రామపంచాయతీలో ఘనంగా బాలల ప్రత్యేక గ్రామసభ

Author
Posted By Praja Nestham Jwala News
| 14 Nov 2026, 07:24 PM |
వేలేరు గ్రామపంచాయతీలో ఘనంగా బాలల ప్రత్యేక గ్రామసభ

వేలేరు, నవంబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వేలేరు మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బిల్లా యాదగిరి అధ్యక్షతన బాలల ప్రత్యేక గ్రామసభను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, ధర్మసాగర్ సీఐ శ్రీనివాస్ హాజరయ్యారు. వేలేరు మండల ఎస్సై దూదిమెట్ల నరేష్ సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యంగా ఏసీపీ ప్రశాంత్ రెడ్డి విద్యార్థులకు విలువైన సందేశాన్ని అందించారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని నవంబర్ 14న జాతీయ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బాలల గ్రామసభలను నిర్వహిస్తూ విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు పాఠశాలల్లో అవసరమైన అభివృద్ధి పనులను గుర్తిస్తోందన్నారు. వాటి పరిష్కారానికి గ్రామపంచాయతీ నిధులు సైతం కేటాయించే అవకాశం ఉందని వివరించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య, మెరుగైన పాఠశాల వసతులు, క్రీడా సౌకర్యాలు కల్పించడం తన బాధ్యత అని పేర్కొన్నారు. పేదరికం కారణంగా ఏ ఒక్క చిన్నారి కూడా చదువుకు దూరం కాకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. నేటి బాలలే రేపటి భావి పౌరులని, వారి సంక్షేమం, విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

గౌరవ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరై, పాఠశాలల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. విద్యార్థులు తమ సమస్యలను, పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలను గ్రామసభ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం చిన్నారులందరికీ హృదయపూర్వక బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకర్, గ్రామపంచాయతీ కార్యదర్శి విజయ, జెడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయుడు సత్యం, లీలా బాయ్, సీసీ రమాదేవి, వార్డు సభ్యులు సంధ్య, మౌనిక, పర్వీన్, సురేష్, సునీల్, ఉపాధ్యాయులు, వీఓల అధ్యక్షులు, సీఏలు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు. సుమారు 250 మంది విద్యార్థులు హాజరై బాలల గ్రామసభలో పాల్గొన్నారు.