వేలేరు గ్రామపంచాయతీలో ఘనంగా బాలల ప్రత్యేక గ్రామసభ

వేలేరు, నవంబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వేలేరు మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బిల్లా యాదగిరి అధ్యక్షతన బాలల ప్రత్యేక గ్రామసభను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, ధర్మసాగర్ సీఐ శ్రీనివాస్ హాజరయ్యారు. వేలేరు మండల ఎస్సై దూదిమెట్ల నరేష్ సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యంగా ఏసీపీ ప్రశాంత్ రెడ్డి విద్యార్థులకు విలువైన సందేశాన్ని అందించారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని నవంబర్ 14న జాతీయ బాలల దినోత్సవాన్ని...