Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రసూల్‌పల్లిలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Author
Posted By Nagilla Rajinikanth
| 14 Nov 2026, 07:19 PM |
రసూల్‌పల్లిలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

రసూల్‌పల్లి, నవంబర్ 14, (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రసూల్‌పల్లి గ్రామంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బోయినీ మహేష్ మాట్లాడుతూ.. విద్యార్థి దశ జీవితానికి బంగారు పునాది వంటిదని, చదువుకునే వయస్సులో విద్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు అనవసర ఆలోచనలు, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చదువుపై పూర్తి ఏకాగ్రత చూపాలని హితవు పలికారు. ప్రతి విద్యార్థి నిర్దిష్ట లక్ష్యాన్ని ఏర్పరచుకొని క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో ముందుకు సాగాలని కోరారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తూ ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

విద్యతో పాటు మంచి నడవడిక, సమయపాలన, పెద్దల పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలని, తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోయినీ మహేష్, ఉపసర్పంచ్ కందుల అనిల్ కుమార్, జీపీఓ సంపత్, పంచాయతీ కార్యదర్శి సదానందం, ఆశా వర్కర్లు, వార్డు సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.