రసూల్పల్లిలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
రసూల్పల్లి, నవంబర్ 14, (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రసూల్పల్లి గ్రామంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బోయినీ మహేష్ మాట్లాడుతూ.. విద్యార్థి దశ జీవితానికి బంగారు పునాది వంటిదని, చదువుకునే వయస్సులో విద్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు అనవసర ఆలోచనలు, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చదువుపై పూర్తి ఏకాగ్రత చూపాలని హితవు పలికారు. ప్రతి విద్యార్థి నిర్దిష్ట లక్ష్యాన్ని ఏర్పరచుకొని క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో ముందుకు సాగాలని కోరారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తూ ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యతో...