Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బాలల దినోత్సవ వేడుకల్లో విద్యార్థులే ఉపాధ్యాయులు!

Author
Posted By Nagilla Rajinikanth
| 14 Nov 2026, 07:18 PM |
బాలల దినోత్సవ వేడుకల్లో విద్యార్థులే ఉపాధ్యాయులు!

మల్లారం, నవంబర్ 14, (ప్రజానేస్తం జ్వాల): బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం ఎంపీపీఎస్ పాఠశాలలో బాలల దినోత్సవం, స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదో తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా, వివిధ విద్యాశాఖ అధికారుల హోదాల్లో బాధ్యతలు స్వీకరించి పాఠశాల నిర్వహణలో చురుకుగా పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారిగా జి. రితిక, మండల విద్యాశాఖ అధికారిగా జి. శ్రీనాథ్, ప్రధానోపాధ్యాయురాలిగా డి. లాస్య, గణిత ఉపాధ్యాయుడిగా ఎన్. జశ్వంత్, ఈవీఎస్ ఉపాధ్యాయుడిగా పి. రుత్విక్, తెలుగు ఉపాధ్యాయుడిగా ఎన్. మోక్షిత్ వ్యవహరించారు.

విద్యార్థులు ఉపాధ్యాయులు, అధికారుల పాత్రలను సమర్థవంతంగా పోషిస్తూ తమలోని నాయకత్వ లక్షణాలను, ప్రతిభను చాటుకున్నారు. ఈ వినూత్న కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, బాధ్యతాయుత భావన, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు దోహదపడింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయ బృందం విద్యార్థులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.