బాలల దినోత్సవ వేడుకల్లో విద్యార్థులే ఉపాధ్యాయులు!

మల్లారం, నవంబర్ 14, (ప్రజానేస్తం జ్వాల): బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం ఎంపీపీఎస్ పాఠశాలలో బాలల దినోత్సవం, స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదో తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా, వివిధ విద్యాశాఖ అధికారుల హోదాల్లో బాధ్యతలు స్వీకరించి పాఠశాల నిర్వహణలో చురుకుగా పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారిగా జి. రితిక, మండల విద్యాశాఖ అధికారిగా జి. శ్రీనాథ్, ప్రధానోపాధ్యాయురాలిగా డి. లాస్య, గణిత ఉపాధ్యాయుడిగా ఎన్. జశ్వంత్, ఈవీఎస్ ఉపాధ్యాయుడిగా పి. రుత్విక్, తెలుగు ఉపాధ్యాయుడిగా ఎన్. మోక్షిత్ వ్యవహరించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు, అధికారుల పాత్రలను సమర్థవంతంగా పోషిస్తూ తమలోని నాయకత్వ లక్షణాలను, ప్రతిభను...