Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత: ఉపసర్పంచ్ షేక్ హైమద్ బాబా

Author
Posted By Praja Nestham Jwala News
| 14 Nov 2026, 07:15 PM |
బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత: ఉపసర్పంచ్ షేక్ హైమద్ బాబా

రావిపహాడ్, నవంబర్ 14, (ప్రజానేస్తం జ్వాల): బాలల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం రావిపహాడ్ గ్రామ ఉపసర్పంచ్ షేక్ హైమద్ బాబా పిలుపునిచ్చారు. బాలల దినోత్సవం సందర్భంగా శనివారం గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో ఆయన మాట్లాడారు. పిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ ఆరోగ్యవంతులుగా పెంచాలని, బాల్యవివాహాలు, బాల కార్మికత్వం, వెట్టిచాకిరిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో బాలల హక్కుల పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం ప్రాథమిక పాఠశాలలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ జ్యోతి మాట్లాడుతూ.. విద్యార్థులు బాల్యం నుంచే ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు. పాఠశాల అదనపు గదుల నిర్మాణం కోసం ఎమ్మెల్యే పద్మావతికి వినతిపత్రం అందజేసినట్లు హెచ్‌ఎం నాయకపు పరమేష్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం అమృత రెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.