బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత: ఉపసర్పంచ్ షేక్ హైమద్ బాబా
రావిపహాడ్, నవంబర్ 14, (ప్రజానేస్తం జ్వాల): బాలల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం రావిపహాడ్ గ్రామ ఉపసర్పంచ్ షేక్ హైమద్ బాబా పిలుపునిచ్చారు. బాలల దినోత్సవం సందర్భంగా శనివారం గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో ఆయన మాట్లాడారు. పిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ ఆరోగ్యవంతులుగా పెంచాలని, బాల్యవివాహాలు, బాల కార్మికత్వం, వెట్టిచాకిరిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో బాలల హక్కుల పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ జ్యోతి మాట్లాడుతూ.....