Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి

Author
Posted By Marelli kiran
| 13 Nov 2026, 07:02 PM |
ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి

రబీ సీజన్‌లో నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ఎంపికపై సూచనలు.. విద్యార్థుల హాజరు 90 శాతానికి పెంచాలని ఆదేశం

హనుమకొండ, నవంబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): రబీ 2026–27 సీజన్‌లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్, సూక్ష్మ సేద్య పద్ధతులను ప్రోత్సహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ పంటల సాగు వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ సమీక్ష
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లతో రబీ సాగు ప్రణాళికలు, విద్యా రంగం, విద్యాసంస్థల నిర్మాణాలు, సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పనుల పురోగతిపై సమీక్షించారు. రబీ సీజన్‌లో అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకునేలా పంటల ప్రణాళిక రూపొందించాలని, వరికి బదులుగా ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని సూచించారు. సూక్ష్మ సేద్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించి, వాటి వినియోగాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

పాఠశాలల్లో విద్యార్థుల హాజరును 90 శాతానికి పెంచేలా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్లకు సూచించారు. విద్యాసంస్థల నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల నమోదును గణనీయంగా పెంచినందుకు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌ను సీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.