ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి
రబీ సీజన్లో నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ఎంపికపై సూచనలు.. విద్యార్థుల హాజరు 90 శాతానికి పెంచాలని ఆదేశం హనుమకొండ, నవంబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): రబీ 2026–27 సీజన్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్, సూక్ష్మ సేద్య పద్ధతులను ప్రోత్సహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ పంటల సాగు వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ సమీక్ష ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్లతో రబీ సాగు ప్రణాళికలు, విద్యా...