Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పీజీ మెడికల్ ప్రవేశాలకు తొలి విడత వెబ్ ఆప్షన్ల నోటిఫికేషన్ విడుదల

Author
Posted By Marelli kiran
| 13 Nov 2026, 06:59 PM |
పీజీ మెడికల్ ప్రవేశాలకు తొలి విడత వెబ్ ఆప్షన్ల నోటిఫికేషన్ విడుదల

నవంబర్ 15 మధ్యాహ్నం 2 గంటల వరకు అవకాశం.. కేఎన్‌ఆర్‌యూహెచ్ఎస్ ప్రకటన

హనుమకొండ, నవంబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): 2026–27 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేఎన్‌ఆర్‌యూహెచ్ఎస్) మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 13 మధ్యాహ్నం 2 గంటల నుంచి నవంబర్ 15 మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని విశ్వవిద్యాలయ అధికారులు సూచించారు. అభ్యర్థులు కోర్సులు, కళాశాలల ఎంపికకు సంబంధించిన ఆప్షన్లను గడువులోగా నమోదు చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ knruhs.telangana.gov.inను, వెబ్ ఆప్షన్ల నమోదు కోసం tspgmed.tsche.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.