పీజీ మెడికల్ ప్రవేశాలకు తొలి విడత వెబ్ ఆప్షన్ల నోటిఫికేషన్ విడుదల

నవంబర్ 15 మధ్యాహ్నం 2 గంటల వరకు అవకాశం.. కేఎన్‌ఆర్‌యూహెచ్ఎస్ ప్రకటన హనుమకొండ, నవంబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): 2026–27 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేఎన్‌ఆర్‌యూహెచ్ఎస్) మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 13 మధ్యాహ్నం 2 గంటల నుంచి నవంబర్ 15 మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని విశ్వవిద్యాలయ అధికారులు సూచించారు. అభ్యర్థులు కోర్సులు, కళాశాలల ఎంపికకు సంబంధించిన ఆప్షన్లను గడువులోగా నమోదు చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ knruhs.telangana.gov.inను, వెబ్...