Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి పరిరక్షణకు కార్మిక సంఘాల వినతి

Author
Posted By A Bharat Goud
| 13 Nov 2026, 06:50 PM |
భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి పరిరక్షణకు కార్మిక సంఘాల వినతి


ఇందిరమ్మ బీమాతో సంక్షేమ పథకాలను ముడిపెట్టవద్దని విజ్ఞప్తి.. కార్మిక శాఖ కార్యాలయంలో వినతిపత్రం

నాగర్‌కర్నూల్, నవంబర్ 13 (ప్రజానేస్తం జ్వాల): భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిని కొనసాగిస్తూ కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయాలని కోరుతూ తెలంగాణ భవన మరియు నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం సమర్పించారు. అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంక్షేమ మండలి ప్రయోజనాలను ఇందిరమ్మ బీమాతో ముడిపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి మారేడు శివశంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి దాంగట్ల వెంకటస్వామి మాట్లాడుతూ.. అనేక పోరాటాల ఫలితంగా ఏర్పడిన భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి ద్వారా కార్మికులకు అందాల్సిన ప్రయోజనాలు నిరంతరంగా కొనసాగించాలని కోరారు. మండలి నిధుల వినియోగం, కార్మికులకు అందుతున్న సేవలు, ఆర్థిక సహాయం పంపిణీ విధానంపై కార్మికులకు స్పష్టత కల్పించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

సహజ, ప్రమాద మరణాలకు సంబంధించిన ఆర్థిక సహాయం విషయంలో ప్రైవేటు బీమా సంస్థలతో ఉన్న ఒప్పందం జూలై 26తో ముగిసిందని, ఈ నేపథ్యంలో పరిహారం కోసం ఎదురుచూస్తున్న కార్మిక కుటుంబాలకు సహాయం అందించే ప్రక్రియను ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. ఇందిరమ్మ బీమా పథకంలో కార్మికులను చేర్చే ప్రతిపాదన ఉన్నప్పటికీ, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి ద్వారా అమలయ్యే ప్రత్యేక ప్రయోజనాలు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఆధార్ వివరాల నవీకరణ, పేర్ల సవరణ వంటి ప్రక్రియలను సులభతరం చేసి ఆర్థిక సహాయం మంజూరులో జాప్యం లేకుండా చూడాలని కోరారు. మీ సేవ కేంద్రాల్లో కార్మికులకు అవసరమైన సేవలు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లాలో ఖాళీగా ఉన్న సహాయ కార్మిక అధికారి, జిల్లా కార్మిక అధికారి పోస్టులను భర్తీ చేయాలని, కార్మికులు పని కూడళ్ల వద్ద విశ్రాంతి తీసుకునేందుకు నీడ సౌకర్యాలు కల్పించాలని కోరారు. భవన నిర్మాణ కార్మికులకు ఆరోగ్య కార్డులు జారీ చేయాలని, 50 ఏళ్లు దాటిన కార్మికులకు నెలకు రూ.5 వేల భృతి అందించాలని, సాధారణ సేవా కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షల విధానంపై పునఃపరిశీలన చేయాలని విజ్ఞప్తి చేశారు. సంక్షేమ మండలిలో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించాలని, సంక్షేమ మండలి పరిరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా తదుపరి కార్యక్రమాలు చేపడతామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డొక్కా లక్ష్మయ్య మేస్త్రి, జెట్టి బాలస్వామి, ఈర్ల భూపేష్, గొర్ల సత్యం, ఈర్ల హుస్సేన్, శ్రీనివాస్ రెడ్డి, కార్మిక సంఘం నాయకులు కల్పన, మల్లేష్, ఆర్. రవి తదితరులతో పాటు మేస్త్రీలు, కార్మికులు పాల్గొన్నారు.