భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి పరిరక్షణకు కార్మిక సంఘాల వినతి
ఇందిరమ్మ బీమాతో సంక్షేమ పథకాలను ముడిపెట్టవద్దని విజ్ఞప్తి.. కార్మిక శాఖ కార్యాలయంలో వినతిపత్రం నాగర్కర్నూల్, నవంబర్ 13 (ప్రజానేస్తం జ్వాల): భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిని కొనసాగిస్తూ కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయాలని కోరుతూ తెలంగాణ భవన మరియు నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం సమర్పించారు. అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంక్షేమ మండలి ప్రయోజనాలను ఇందిరమ్మ బీమాతో ముడిపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి మారేడు శివశంకర్,...