Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నర్సాయిగూడెం రహదారికి రూ.2.20 కోట్ల నిధులు మంజూరు

Author
Posted By Praja Nestham Jwala News
| 13 Nov 2026, 06:31 PM |
నర్సాయిగూడెం రహదారికి రూ.2.20 కోట్ల నిధులు మంజూరు

ముఖ్యమైన పాయింట్స్:

  • •రోడ్డు పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ చిన్న వెంకటరెడ్డి.
  • •మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి గ్రామస్థుల కృతజ్ఞతలు

నేరేడుచర్ల ప్రజానేస్తం జ్వాల :హుజూర్‌నగర్ ఆర్ఎంబీ రోడ్డు నుంచి నర్సాయిగూడెం గ్రామానికి వెళ్లే రహదారి నిర్మాణ పనులకు రూ.2 కోట్ల 20 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు రహదారి పనులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు అలక శ్రవణ్ రెడ్డి, కౌన్సిలర్ నన్నెపంగు శ్రీనివాస్, మాజీ చైర్మన్ ప్రకాష్, తాళ్ల సురేష్ రెడ్డి, కట్ట గణేష్ రెడ్డి, బెల్లంకొండ శ్యామసుందర్ రెడ్డి, భగవంతు రెడ్డి, మొగరాల శీను, మచ్చ రవి తదితరులు పాల్గొన్నారు.

నర్సాయిగూడెం గ్రామానికి రహదారి సౌకర్యం మెరుగుపరిచేందుకు రూ.2.20 కోట్ల నిధులు మంజూరు చేయడంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నల్లమల ఉత్తమ్ కుమార్ రెడ్డికి గ్రామస్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రహదారి నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజల రాకపోకలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి