నర్సాయిగూడెం రహదారికి రూ.2.20 కోట్ల నిధులు మంజూరు

ముఖ్యమైన పాయింట్స్:•రోడ్డు పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ చిన్న వెంకటరెడ్డి.•మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి గ్రామస్థుల కృతజ్ఞతలు నేరేడుచర్ల ప్రజానేస్తం జ్వాల :హుజూర్‌నగర్ ఆర్ఎంబీ రోడ్డు నుంచి నర్సాయిగూడెం గ్రామానికి వెళ్లే రహదారి నిర్మాణ పనులకు రూ.2 కోట్ల 20 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు రహదారి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు అలక శ్రవణ్ రెడ్డి, కౌన్సిలర్ నన్నెపంగు శ్రీనివాస్, మాజీ చైర్మన్ ప్రకాష్, తాళ్ల సురేష్ రెడ్డి, కట్ట గణేష్ రెడ్డి, బెల్లంకొండ శ్యామసుందర్ రెడ్డి, భగవంతు...