Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రూ.1.68 కోట్లతో కాలనీల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం

Author
Posted By Praja Nestham Jwala News
| 12 Nov 2026, 04:13 PM |
రూ.1.68 కోట్లతో కాలనీల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం


చంద్రపురి, గాంధీనగర్‌లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపన

జవహర్‌నగర్, నవంబర్ 12 (ప్రజానేస్తం జ్వాల): మేడ్చల్–మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలోని కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.1.68 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. చంద్రపురి కాలనీలో రూ.1.36 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణానికి, జవహర్‌నగర్ డివిజన్‌లోని గాంధీనగర్ కాలనీలో రూ.32 లక్షలతో డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రపురి డివిజన్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, జవహర్‌నగర్ డివిజన్ అధ్యక్షురాలు శాంతి కోటేష్ గౌడ్, డీసీసీ కార్యదర్శి సదానందం, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కాలనీల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి