రూ.1.68 కోట్లతో కాలనీల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం
చంద్రపురి, గాంధీనగర్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపన జవహర్నగర్, నవంబర్ 12 (ప్రజానేస్తం జ్వాల): మేడ్చల్–మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలోని కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.1.68 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. చంద్రపురి కాలనీలో రూ.1.36 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణానికి, జవహర్నగర్ డివిజన్లోని గాంధీనగర్ కాలనీలో రూ.32 లక్షలతో డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి...