Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

Author
Posted By Nagaraju Golla
| 12 Nov 2026, 03:38 PM |
యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

నీటి వనరుల సంరక్షణకు ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి.. రైతులకు వ్యవసాయ శాఖ సూచన

నడికూడ, నవంబర్ 12 (ప్రజానేస్తం జ్వాల): యాసంగి సీజన్‌లో వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచించారు. నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామ రైతువేదికలో ఆత్మ (ATMA) ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు క్షేత్ర పాఠశాల కార్యక్రమంలో యాసంగి సాగు ప్రణాళిక, పంటల మార్పిడి, నీటి యాజమాన్యం, సమగ్ర చీడపీడల నివారణపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి పోరిక జైసింగ్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం అనిశ్చితి, భూగర్భ జలాల తగ్గుదలను దృష్టిలో ఉంచుకొని రైతులు ముందస్తు పంట ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. వరికి అధిక నీరు అవసరమయ్యే నేపథ్యంలో శనగ, పెసర, మినుము, వేరుశనగ, ఆవాలు వంటి ఆరుతడి పంటలను భూమి స్వభావం, నీటి లభ్యతకు అనుగుణంగా సాగు చేయాలని కోరారు.

ఇవి కూడా చదవండి

TRVK శాస్త్రవేత్త డాక్టర్ బి.వి. రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. భూసార పరీక్షల ఆధారంగా సమతుల్య ఎరువులు వినియోగించాలని, పంటల మార్పిడితో నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. పప్పుధాన్యాల సాగు ద్వారా భూసారం మెరుగుపడుతుందని వివరించారు. సమగ్ర చీడపీడల యాజమాన్య పద్ధతులు పాటిస్తూ, శాస్త్రీయ సిఫారసుల మేరకే పురుగుమందులు వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు జంగే భాస్కర్, జోరు ప్రశాంత్, సూత్రపు గోపినాథ్, మాదారపు రామకృష్ణతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.