యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
నీటి వనరుల సంరక్షణకు ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి.. రైతులకు వ్యవసాయ శాఖ సూచన నడికూడ, నవంబర్ 12 (ప్రజానేస్తం జ్వాల): యాసంగి సీజన్లో వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచించారు. నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామ రైతువేదికలో ఆత్మ (ATMA) ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు క్షేత్ర పాఠశాల కార్యక్రమంలో యాసంగి సాగు ప్రణాళిక, పంటల మార్పిడి, నీటి యాజమాన్యం, సమగ్ర చీడపీడల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి పోరిక జైసింగ్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం, వర్షపాతం అనిశ్చితి, భూగర్భ జలాల తగ్గుదలను...