Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన ప్రాణాపాయం!

Author
Posted By Praja Nestham Jwala News
| 12 Nov 2026, 01:00 PM |
శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన ప్రాణాపాయం!

  • ముచ్చింతల్ సమీపంలో పండ్ల వ్యాన్ ఢీ.. కారుకు భారీగా నష్టం.. సురక్షితంగా బయటపడ్డ శేఖర్ మాస్టర్, సిబ్బంది

రంగారెడ్డి, శంషాబాద్ 12(ప్రజానేస్తం జ్వాల): రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం ముచ్చింతల్ సమీపంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. చిరంజీవి నటిస్తున్న సినిమా షూటింగ్ ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వెళ్తుండగా ముచ్చింతల్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పండ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ వ్యాన్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు దెబ్బతిన్నప్పటికీ శేఖర్ మాస్టర్‌తో పాటు ఆయన సిబ్బంది ఎలాంటి ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.

ఇవి కూడా చదవండి

ప్రమాద వార్త తెలియడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే శేఖర్ మాస్టర్ క్షేమంగా ఉన్నారని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.

పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఊరట వ్యక్తం చేస్తున్నారు.