శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన ప్రాణాపాయం!
ముచ్చింతల్ సమీపంలో పండ్ల వ్యాన్ ఢీ.. కారుకు భారీగా నష్టం.. సురక్షితంగా బయటపడ్డ శేఖర్ మాస్టర్, సిబ్బంది రంగారెడ్డి, శంషాబాద్ 12(ప్రజానేస్తం జ్వాల): రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం ముచ్చింతల్ సమీపంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. చిరంజీవి నటిస్తున్న సినిమా షూటింగ్ ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వెళ్తుండగా ముచ్చింతల్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పండ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ వ్యాన్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు దెబ్బతిన్నప్పటికీ శేఖర్ మాస్టర్‌తో పాటు ఆయన సిబ్బంది ఎలాంటి ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద వార్త తెలియడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే...