Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కోదాడలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Author
Posted By Praja Nestham Jwala News
| 11 Nov 2026, 07:05 PM |
కోదాడలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కోదాడ, నవంబర్ 11 (ప్రజానేస్తం జ్వాల):

కోదాడ పట్టణంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను రాష్ట్ర నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.

ఈ సందర్భంగా రూ.5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నీటిపారుదల శాఖ నూతన భవనాన్ని, రూ.8 కోట్ల వ్యయంతో చేపడుతున్న రోడ్లు, భవనాల శాఖ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. అదేవిధంగా పట్టణంలో నిర్మిస్తున్న షాదీఖానా పనుల పురోగతిని కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఇవి కూడా చదవండి

భవన నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని మంత్రి సూచించారు. నూతన ఆర్కిటెక్చర్‌ డిజైన్లతో పట్టణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా భవనాలను నిర్మించాలని, పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్‌ సభ్యులు కుందూరు రఘువీర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, జిల్లా ఎస్పీ నరసింహ, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వంగవీటి రామారావు, ఆర్డీవో సూర్యనారాయణ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.