కోదాడలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
కోదాడ, నవంబర్ 11 (ప్రజానేస్తం జ్వాల): కోదాడ పట్టణంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను రాష్ట్ర నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా రూ.5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నీటిపారుదల శాఖ నూతన భవనాన్ని, రూ.8 కోట్ల వ్యయంతో చేపడుతున్న రోడ్లు, భవనాల శాఖ నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. అదేవిధంగా పట్టణంలో నిర్మిస్తున్న షాదీఖానా పనుల పురోగతిని కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని...