Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

హుజూర్‌నగర్ మున్సిపాలిటీ నిధుల ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలి

Author
Posted By Praja Nestham Jwala News
| 11 Nov 2026, 06:51 PM |
హుజూర్‌నగర్ మున్సిపాలిటీ నిధుల ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలి

హుజూర్‌నగర్, నవంబర్ 11 (ప్రజానేస్తం జ్వాల): హుజూర్‌నగర్ మున్సిపాలిటీలో జనరల్ ఫండ్, క్యాపిటల్ ఫండ్ కింద మంజూరైన నిధులు, వాటి వినియోగం, ఖర్చులపై పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతూ ఐదుగురు కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఇటీవల నిర్వహించిన మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో నిధుల వివరాలను అధికారులు సంక్షిప్తంగా వెల్లడించారని, అయితే పూర్తి స్థాయి లెక్కలను ప్రజాప్రతినిధులకు అందించాలని వారు కోరారు.

మున్సిపాలిటీలో ఇంజనీరింగ్, శానిటేషన్ తదితర విభాగాల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు, కాంట్రాక్టర్లకు అప్పగించిన పనులు, కేటాయించిన నిధులు, చేసిన ఖర్చులు, చెల్లింపుల వివరాలను వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సిబ్బంది వేతనాలు, వార్డుల వారీగా చేపట్టిన అభివృద్ధి పనులు, వాటికి సంబంధించిన బిల్లులు, చెల్లింపుల వివరాలను అందించాలని కోరారు. ప్రజాధనం వినియోగంలో పారదర్శకత ఉండాలని, మున్సిపాలిటీ ఆదాయ, వ్యయాలపై ప్రజలకు స్పష్టత కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. జనరల్ ఫండ్, క్యాపిటల్ ఫండ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను బహిర్గతం చేస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని కమిషనర్‌ను కోరారు.

ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ కోడి జ్యోతి ఉపేందర్, 8వ వార్డు కౌన్సిలర్ కోల ఉదయభాను, 22వ వార్డు కౌన్సిలర్ అమరబోయిన ఊహ సతీష్, 23వ వార్డు కౌన్సిలర్ అట్లూరి మంజుల హరిబాబు, 24వ వార్డు కౌన్సిలర్ యడ్ల విజయ్ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి