హుజూర్నగర్ మున్సిపాలిటీ నిధుల ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
హుజూర్నగర్, నవంబర్ 11 (ప్రజానేస్తం జ్వాల): హుజూర్నగర్ మున్సిపాలిటీలో జనరల్ ఫండ్, క్యాపిటల్ ఫండ్ కింద మంజూరైన నిధులు, వాటి వినియోగం, ఖర్చులపై పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతూ ఐదుగురు కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్కు వినతిపత్రం సమర్పించారు. ఇటీవల నిర్వహించిన మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో నిధుల వివరాలను అధికారులు సంక్షిప్తంగా వెల్లడించారని, అయితే పూర్తి స్థాయి లెక్కలను ప్రజాప్రతినిధులకు అందించాలని వారు కోరారు. మున్సిపాలిటీలో ఇంజనీరింగ్, శానిటేషన్ తదితర విభాగాల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు, కాంట్రాక్టర్లకు అప్పగించిన పనులు, కేటాయించిన నిధులు, చేసిన ఖర్చులు, చెల్లింపుల వివరాలను వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సిబ్బంది వేతనాలు, వార్డుల...