Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ముఖ్యమంత్రితో ముఖాముఖీకి ఉపాధ్యాయుడు చారుగుండ్ల రాజశేఖర్‌కు ప్రత్యేక ఆహ్వానం

Author
Posted By Praja Nestham Jwala News
| 08 Nov 2026, 05:06 PM |
ముఖ్యమంత్రితో ముఖాముఖీకి ఉపాధ్యాయుడు చారుగుండ్ల రాజశేఖర్‌కు ప్రత్యేక ఆహ్వానం

  • జపాన్ విద్యావిధానంపై అధ్యయనం చేసిన ఉపాధ్యాయుడికి అరుదైన అవకాశం – విద్యారంగంలో ప్రత్యేక గుర్తింపు


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జపాన్ విద్యావిధానంపై ఎక్స్‌పోజర్ విజిట్‌లో పాల్గొని, అక్కడి విద్యా వ్యవస్థను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన ఉపాధ్యాయుడు, సైకాలజిస్ట్ చారుగుండ్ల రాజశేఖర్‌కు అరుదైన అవకాశం లభించింది. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారితో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయనకు ప్రత్యేక ఆహ్వానం అందింది.

ముఖ్యమంత్రితో ముఖాముఖీకి ఉపాధ్యాయుడు చారుగుండ్ల రాజశేఖర్‌కు ప్రత్యేక ఆహ్వానం - Additional Image

గత సెప్టెంబర్ 5 నుంచి 12 వరకు జపాన్‌లో పర్యటించిన రాజశేఖర్ అక్కడి వివిధ విద్యాసంస్థలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యాబోధన పద్ధతులు, విద్యా ప్రమాణాలు, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, ఆధునిక బోధనా విధానాలను పరిశీలించారు.

జపాన్ విద్యావ్యవస్థలోని మాతృభాషా బోధన, క్రమశిక్షణ, జీవన నైపుణ్యాలు, ప్రయోగాత్మక విద్య, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు అందించే విద్య వంటి కీలక అంశాలను అధ్యయనం చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలో నవంబర్ 14, 2026న తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ముఖ్యమంత్రితో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు SCERT డైరెక్టర్ శ్రీ జి. రమేష్ ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో జపాన్‌లో తాను పరిశీలించిన ఉత్తమ విద్యా విధానాలు, వాటిని తెలంగాణ విద్యావ్యవస్థలో అమలు చేయాల్సిన అవసరం, నాణ్యమైన విద్య కోసం తీసుకోవాల్సిన చర్యలపై రాజశేఖర్ తన అనుభవాలను, అభిప్రాయాలను ముఖ్యమంత్రితో పంచుకోనున్నారు.

విదేశీ విద్యావిధానాలను అధ్యయనం చేసి, వాటి ద్వారా మన రాష్ట్ర విద్యా ప్రగతికి ఉపయోగపడే సూచనలు అందించే అవకాశం రావడం ఉపాధ్యాయుడిగా చారుగుండ్ల రాజశేఖర్ విద్యా నిబద్ధతకు, కృషికి లభించిన ప్రత్యేక గుర్తింపుగా పలువురు అభినందిస్తున్నారు.

విద్యా రంగంలో నూతన ఆలోచనలు... నాణ్యమైన విద్య వైపు మరో ముందడుగు!