ముఖ్యమంత్రితో ముఖాముఖీకి ఉపాధ్యాయుడు చారుగుండ్ల రాజశేఖర్‌కు ప్రత్యేక ఆహ్వానం
జపాన్ విద్యావిధానంపై అధ్యయనం చేసిన ఉపాధ్యాయుడికి అరుదైన అవకాశం – విద్యారంగంలో ప్రత్యేక గుర్తింపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జపాన్ విద్యావిధానంపై ఎక్స్పోజర్ విజిట్‌లో పాల్గొని, అక్కడి విద్యా వ్యవస్థను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన ఉపాధ్యాయుడు, సైకాలజిస్ట్ చారుగుండ్ల రాజశేఖర్‌కు అరుదైన అవకాశం లభించింది. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారితో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయనకు ప్రత్యేక ఆహ్వానం అందింది. గత సెప్టెంబర్ 5 నుంచి 12 వరకు జపాన్‌లో పర్యటించిన రాజశేఖర్ అక్కడి వివిధ విద్యాసంస్థలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యాబోధన పద్ధతులు, విద్యా ప్రమాణాలు, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, ఆధునిక బోధనా విధానాలను పరిశీలించారు. జపాన్...