Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

జగన్ నమ్మకాన్ని నిలబెట్టిన మండవ శ్రీనివాస్ గౌడ్

Author
Posted By Praja Nestham Jwala News
| 07 Nov 2026, 09:22 PM | ANDHRA PRADESH
జగన్ నమ్మకాన్ని నిలబెట్టిన మండవ శ్రీనివాస్ గౌడ్

  • జగ్గయ్యపేట జెడ్పీటీసీగా ఘన విజయం.. బీసీ నాయకుడి రాజకీయ ప్రస్థానంలో మరో మైలురాయి


జగ్గయ్యపేట , నవంబర్ 7, (ప్రజానేస్తం జ్వాల): బీసీల హక్కులు, ఆత్మగౌరవం, రాజకీయ రాజ్యాధికార సాధన కోసం నిరంతరం పోరాటం సాగిస్తున్న మండవ శ్రీనివాస్ గౌడ్ జగ్గయ్యపేట జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనపై నమ్మకంతో జెడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించగా, ప్రజల మద్దతుతో అత్యధిక మెజారిటీ సాధించి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బీసీల హక్కుల కోసం తన గళాన్ని వినిపిస్తూ, బడుగు, బలహీన వర్గాలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే లక్ష్యంతో శ్రీనివాస్ గౌడ్ నిరంతరం కృషి చేస్తున్నారు. రాజకీయ అండదండలు పరిమితంగా ఉన్నప్పటికీ తన పోరాట పటిమ, పట్టుదల, ప్రజలతో ఉన్న అనుబంధంతో ముందుకు సాగారు.

ఇవి కూడా చదవండి

జగన్ మోహన్ రెడ్డి తనపై ఉంచిన విశ్వాసాన్ని ప్రజా తీర్పుతో విజయంగా మలచుకున్న మండవ శ్రీనివాస్ గౌడ్‌కు ఈ విజయం రాజకీయంగా ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఈ గెలుపు వ్యక్తిగత విజయానికే పరిమితం కాకుండా బీసీల ఆత్మగౌరవానికి, సామాజిక న్యాయం కోసం సాగుతున్న పోరాటానికి లభించిన గుర్తింపుగా ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు అభివర్ణిస్తున్నారు.

జెడ్పీటీసీగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, బీసీల హక్కుల సాధనతో పాటు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి మరింత సేవలందించాలని పలువురు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మండవ శ్రీనివాస్ గౌడ్‌కు అభిమానులు, బీసీ సంఘాల నాయకులు, శ్రేయోభిలాషులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.