జగన్ నమ్మకాన్ని నిలబెట్టిన మండవ శ్రీనివాస్ గౌడ్
జగ్గయ్యపేట జెడ్పీటీసీగా ఘన విజయం.. బీసీ నాయకుడి రాజకీయ ప్రస్థానంలో మరో మైలురాయి జగ్గయ్యపేట , నవంబర్ 7, (ప్రజానేస్తం జ్వాల): బీసీల హక్కులు, ఆత్మగౌరవం, రాజకీయ రాజ్యాధికార సాధన కోసం నిరంతరం పోరాటం సాగిస్తున్న మండవ శ్రీనివాస్ గౌడ్ జగ్గయ్యపేట జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనపై నమ్మకంతో జెడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించగా, ప్రజల మద్దతుతో అత్యధిక మెజారిటీ సాధించి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బీసీల హక్కుల కోసం తన గళాన్ని వినిపిస్తూ, బడుగు, బలహీన వర్గాలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే...