Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ముల్కనూర్‌లో అంబరాన్నంటిన సదర్ సంబరాలు..

Author
Posted By Nagilla Rajinikanth
| 07 Nov 2026, 09:21 PM |
ముల్కనూర్‌లో అంబరాన్నంటిన సదర్ సంబరాలు..

తొలిసారిగా నిర్వహించిన సదర్ మహోత్సవానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు

దున్నపోతుల విన్యాసాలు, యాదవ సంప్రదాయ ప్రదర్శనలతో కోలాహలంగా వేడుకలు

ముల్కనూర్‌లో అంబరాన్నంటిన సదర్ సంబరాలు.. - Additional Image

భీమదేవరపల్లి, నవంబర్ 7 (ప్రజా నేస్తం జ్వాల): భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో తొలిసారిగా నిర్వహించిన సదర్ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. యాదవుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే సదర్ వేడుకలు గ్రామంలో పండుగ వాతావరణాన్ని నింపాయి. ఈ మహోత్సవానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరుకావడంతో వేడుకలకు మరింత ప్రత్యేకత సంతరించుకుంది. మంత్రి రాక సందర్భంగా యాదవ సంఘం నాయకులు, నిర్వాహకులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.

ఇవి కూడా చదవండి

ముల్కనూర్ గ్రామ చరిత్రలో తొలిసారిగా సదర్ మహోత్సవాన్ని నిర్వహించడంతో గ్రామస్తులు, యాదవ సంఘం ప్రతినిధులు ఎంతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రికి స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నాయకులు, యాదవ సంఘం ప్రతినిధులు, యువకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో సదర్ వేడుకల ప్రాంగణం జనసందోహంతో కిక్కిరిసిపోయింది. సంప్రదాయబద్ధంగా అలంకరించిన దున్నపోతులు, వాటి ప్రత్యేక విన్యాసాలు వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దున్నపోతుల ప్రదర్శనలను చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరిచారు. వాటి విన్యాసాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ముల్కనూర్‌లో అంబరాన్నంటిన సదర్ సంబరాలు.. - Additional Image

సదర్ పండుగ యాదవ సమాజం ఐక్యతకు, సంప్రదాయ పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా పలువురు నాయకులు పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు సామాజిక ఐక్యతను చాటిచెప్పేలా ఇలాంటి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. గ్రామంలో తొలిసారిగా నిర్వహించిన ఈ మహోత్సవానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరుకావడం యాదవ సంఘం నాయకులు, నిర్వాహకుల్లో ఉత్సాహాన్ని నింపింది.

ఈ కార్యక్రమంలో భీమదేవరపల్లి మండల అధ్యక్షుడు పోచంపల్లి రాజిరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కుల అనిల్ యాదవ్, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి, ఉప సర్పంచ్ మమతా బాలకృష్ణ, యాదవ సంఘం భీమదేవరపల్లి నాయకులు, సీనియర్ నాయకులు ఉసకోల ప్రకాష్, కొలుగూరి రాజు, ఆధరి రవీందర్, మంగ రామచంద్రం, మాజీ ఎంపీపీ అశోక్ ముఖర్జీ, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కేతిరి లక్ష్మారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, యాదవ సంఘం ప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.