ముల్కనూర్‌లో అంబరాన్నంటిన సదర్ సంబరాలు..
తొలిసారిగా నిర్వహించిన సదర్ మహోత్సవానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు దున్నపోతుల విన్యాసాలు, యాదవ సంప్రదాయ ప్రదర్శనలతో కోలాహలంగా వేడుకలు భీమదేవరపల్లి, నవంబర్ 7 (ప్రజా నేస్తం జ్వాల): భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో తొలిసారిగా నిర్వహించిన సదర్ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. యాదవుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే సదర్ వేడుకలు గ్రామంలో పండుగ వాతావరణాన్ని నింపాయి. ఈ మహోత్సవానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరుకావడంతో వేడుకలకు మరింత ప్రత్యేకత సంతరించుకుంది. మంత్రి రాక సందర్భంగా యాదవ సంఘం నాయకులు, నిర్వాహకులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ముల్కనూర్ గ్రామ చరిత్రలో తొలిసారిగా సదర్ మహోత్సవాన్ని...