Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో బాలింత మృతి

Author
Posted By Marelli kiran
| 07 Nov 2026, 09:19 PM |
హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో బాలింత మృతి

హనుమకొండ, నవంబర్ 7 (ప్రజానేస్తం జ్వాల):

హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్టేషన్ ఘన్‌పూర్ మండలం పాంనూరు గ్రామానికి చెందిన పొన్న రమ్య అనే బాలింత ప్రసవం అనంతరం మృతి చెందింది. శిశువుకు జన్మనిచ్చిన రెండు గంటలకే తీవ్ర రక్తస్రావం కావడంతో తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు సకాలంలో అందుబాటులో లేకపోవడం, సరైన సమయంలో వైద్య సేవలు అందకపోవడమే రమ్య మృతికి కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

అయితే ఈ ఆరోపణలపై ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ మంజుల స్పందిస్తూ.. రమ్య గత కొంతకాలంగా ఎస్ఎల్ఈ (SLE), లూపస్ నెఫ్రైటిస్ వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి సంక్లిష్టంగా ఉన్నప్పటికీ మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య బృందం ప్రయత్నించిందని, అయినప్పటికీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయామని వివరించారు.

బాలింత మృతితో పాంనూరు గ్రామంలో విషాదం నెలకొంది. ఒకవైపు కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యంపై ఆరోపణలు చేస్తుండగా, మరోవైపు ఆసుపత్రి అధికారులు ఆమెకు ఉన్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది.