హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో బాలింత మృతి
హనుమకొండ, నవంబర్ 7 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్టేషన్ ఘన్పూర్ మండలం పాంనూరు గ్రామానికి చెందిన పొన్న రమ్య అనే బాలింత ప్రసవం అనంతరం మృతి చెందింది. శిశువుకు జన్మనిచ్చిన రెండు గంటలకే తీవ్ర రక్తస్రావం కావడంతో తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు సకాలంలో అందుబాటులో లేకపోవడం, సరైన సమయంలో వైద్య సేవలు అందకపోవడమే రమ్య మృతికి కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని...