Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బియ్యం ధరల పెరుగుదలకు కళ్లెం.. కేంద్రం కీలక నిర్ణయం

Author
Posted By Marelli kiran
| 07 Nov 2026, 09:19 PM |
బియ్యం ధరల పెరుగుదలకు కళ్లెం.. కేంద్రం కీలక నిర్ణయం

హనుమకొండ, నవంబర్ 7 (ప్రజానేస్తం జ్వాల):

దేశవ్యాప్తంగా బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. బియ్యం ధరలను నియంత్రించడంతో పాటు అక్రమ నిల్వలు, కృత్రిమ కొరతను అరికట్టే లక్ష్యంతో వ్యాపారులు, మిల్లర్లకు కొత్త నిబంధనలు విధించింది. తమ వద్ద ఉన్న ధాన్యం, బియ్యం నిల్వల వివరాలను ప్రతి శుక్రవారం అధికారిక ఫుడ్ స్టాక్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించింది.

ఈ నిబంధనల ప్రకారం బియ్యం వ్యాపారులు, రైస్ మిల్లర్లు తమ వద్ద ఉన్న నిల్వల వివరాలను క్రమం తప్పకుండా వెల్లడించాల్సి ఉంటుంది. తద్వారా మార్కెట్లో బియ్యం నిల్వలు, సరఫరా పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుంది. నిల్వల వివరాల్లో పారదర్శకత పెంచడంతో పాటు ధరల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవచ్చని కేంద్రం భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఐదు రాష్ట్రాలకు స్టాక్ లిమిట్స్ విధించే అధికారం

ధరల నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలను కల్పించింది. ఆయా రాష్ట్రాల్లో బియ్యం నిల్వలు, మార్కెట్ పరిస్థితులు, స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్టాక్ పరిమితులు విధించుకునే అవకాశం కల్పించింది. ఈ అధికారాలను 2027 జనవరి 31వ తేదీ వరకు వినియోగించుకోవచ్చని కేంద్రం వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో బియ్యం నిల్వలు, సరఫరాపై పర్యవేక్షణ మరింత పెరగనుంది. వ్యాపారులు, మిల్లర్లు నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఈ చర్యలు బహిరంగ మార్కెట్లో బియ్యం ధరల స్థిరీకరణకు, వినియోగదారులకు సరసమైన ధరలకు బియ్యం అందుబాటులో ఉండేందుకు దోహదపడతాయని భావిస్తున్నారు.