బియ్యం ధరల పెరుగుదలకు కళ్లెం.. కేంద్రం కీలక నిర్ణయం

హనుమకొండ, నవంబర్ 7 (ప్రజానేస్తం జ్వాల): దేశవ్యాప్తంగా బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. బియ్యం ధరలను నియంత్రించడంతో పాటు అక్రమ నిల్వలు, కృత్రిమ కొరతను అరికట్టే లక్ష్యంతో వ్యాపారులు, మిల్లర్లకు కొత్త నిబంధనలు విధించింది. తమ వద్ద ఉన్న ధాన్యం, బియ్యం నిల్వల వివరాలను ప్రతి శుక్రవారం అధికారిక ఫుడ్ స్టాక్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించింది. ఈ నిబంధనల ప్రకారం బియ్యం వ్యాపారులు, రైస్ మిల్లర్లు తమ వద్ద ఉన్న నిల్వల వివరాలను క్రమం తప్పకుండా వెల్లడించాల్సి ఉంటుంది. తద్వారా మార్కెట్లో బియ్యం నిల్వలు, సరఫరా పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు...