Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ సమాచారం కోసం ఆర్టీఐలో 1,886 ప్రశ్నలు

Author
Posted By Marelli kiran
| 07 Nov 2026, 09:18 PM |
ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ సమాచారం కోసం ఆర్టీఐలో 1,886 ప్రశ్నలు

హనుమకొండ, నవంబర్ 7 (ప్రజానేస్తం జ్వాల):

మాజీ ప్రియురాలి వ్యక్తిగత వివరాలు తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టాన్ని (ఆర్టీఐ) దుర్వినియోగం చేసిన ఓ యువకుడిపై తమిళనాడు సమాచార కమిషన్ కఠిన చర్యలు తీసుకుంది. ఏకంగా 97 ఆర్టీఐ దరఖాస్తులు సమర్పించి, మొత్తం 1,886 ప్రశ్నలతో యువతి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు కోరినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషన్ సదరు వ్యక్తిపై ఏడాది పాటు ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు చేయకుండా నిషేధం విధించింది.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని విల్లుపురంలో 2021 నుంచి 2024 మధ్యకాలంలో కలిసి చదువుకున్న ఓ యువకుడు, యువతి మధ్య పరిచయం ఏర్పడింది. అనంతరం ఇద్దరూ దూరమయ్యారు. ఈ నేపథ్యంలో యువకుడు తన మాజీ ప్రియురాలి వ్యక్తిగత వివరాలు తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించాడు. ఆమె ఎంతమందితో డేటింగ్ చేసింది? వివాహం జరిగిందా? ప్రస్తుతం జీవించి ఉందా? వంటి వ్యక్తిగత అంశాలపై ప్రశ్నలు సంధిస్తూ వరుసగా దరఖాస్తులు సమర్పించాడు.

ఇవి కూడా చదవండి

ఇలా మొత్తం 97 దరఖాస్తుల ద్వారా 1,886 ప్రశ్నలు అడగడంతో ఈ వ్యవహారం సమాచార కమిషన్ దృష్టికి వెళ్లింది. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను సేకరించేందుకు ఆర్టీఐని పదేపదే ఉపయోగించడాన్ని కమిషన్ తీవ్రంగా పరిగణించింది.

ఈ నేపథ్యంలో సదరు యువకుడు ఏడాది పాటు ఎలాంటి ఆర్టీఐ దరఖాస్తులు సమర్పించకుండా నిషేధం విధించడంతో పాటు, అతడికి మానసిక కౌన్సెలింగ్ ఇప్పించాలని సంబంధిత శాఖను ఆదేశించినట్లు సమాచారం. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన సమాచారం పొందేందుకు ఉద్దేశించిన సమాచార హక్కు చట్టాన్ని వ్యక్తిగత కక్షలు, వేధింపులకు ఉపయోగించకూడదనే అంశాన్ని ఈ ఘటన మరోసారి చర్చకు తెచ్చింది