ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ సమాచారం కోసం ఆర్టీఐలో 1,886 ప్రశ్నలు

హనుమకొండ, నవంబర్ 7 (ప్రజానేస్తం జ్వాల): మాజీ ప్రియురాలి వ్యక్తిగత వివరాలు తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టాన్ని (ఆర్టీఐ) దుర్వినియోగం చేసిన ఓ యువకుడిపై తమిళనాడు సమాచార కమిషన్ కఠిన చర్యలు తీసుకుంది. ఏకంగా 97 ఆర్టీఐ దరఖాస్తులు సమర్పించి, మొత్తం 1,886 ప్రశ్నలతో యువతి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు కోరినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషన్ సదరు వ్యక్తిపై ఏడాది పాటు ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు చేయకుండా నిషేధం విధించింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని విల్లుపురంలో 2021 నుంచి 2024 మధ్యకాలంలో కలిసి చదువుకున్న ఓ యువకుడు, యువతి మధ్య పరిచయం ఏర్పడింది. అనంతరం ఇద్దరూ దూరమయ్యారు. ఈ...