Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పెండింగ్ వేతనాల కోసం ఎంజీఎం సిబ్బంది ధర్నా.. నిలిచిన సేవలు

Author
Posted By Marelli kiran
| 07 Nov 2026, 09:18 PM |
పెండింగ్ వేతనాల కోసం ఎంజీఎం సిబ్బంది ధర్నా.. నిలిచిన సేవలు

నెల రోజులుగా అదనపు విధులు నిర్వహిస్తున్నా వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన

సమ్మెతో రోగులు, వారి బంధువులకు ఇబ్బందులు

హనుమకొండ, నవంబర్ 7 (ప్రజానేస్తం జ్వాల):

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సిబ్బంది పెండింగ్ వేతనాల కోసం ఆందోళనకు దిగారు. శనివారం విధులను బహిష్కరించి నిరసన చేపట్టడంతో ఆసుపత్రిలో పలు సేవలకు అంతరాయం ఏర్పడింది. నెల రోజులుగా అదనపు విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమకు వేతనాలు చెల్లించడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోనూ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నామని, అయినప్పటికీ తమ శ్రమకు తగిన వేతనాలు అందడం లేదని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకృష్ణ ఏజెన్సీ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. వేతనాలు చెల్లించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

సిబ్బంది విధులను బహిష్కరించడంతో ఎంజీఎం ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ఇతర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన రోగులు, వారి సహాయకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆసుపత్రి యాజమాన్యం, సంబంధిత ఏజెన్సీ అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని సిబ్బంది కోరుతున్నారు.