పెండింగ్ వేతనాల కోసం ఎంజీఎం సిబ్బంది ధర్నా.. నిలిచిన సేవలు
నెల రోజులుగా అదనపు విధులు నిర్వహిస్తున్నా వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన సమ్మెతో రోగులు, వారి బంధువులకు ఇబ్బందులు హనుమకొండ, నవంబర్ 7 (ప్రజానేస్తం జ్వాల): వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సిబ్బంది పెండింగ్ వేతనాల కోసం ఆందోళనకు దిగారు. శనివారం విధులను బహిష్కరించి నిరసన చేపట్టడంతో ఆసుపత్రిలో పలు సేవలకు అంతరాయం ఏర్పడింది. నెల రోజులుగా అదనపు విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమకు వేతనాలు చెల్లించడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోనూ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నామని, అయినప్పటికీ తమ శ్రమకు తగిన వేతనాలు అందడం లేదని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే...